Covid vaccine: 2లక్షల మందికిపైగా గర్భిణీలకు టీకా
కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 2.27లక్షలకు పైగా గర్భిణీలు కరోనా టీకా మొదటిడోసు వేయించుకున్నారని పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది.
దిల్లీ: కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకూ 2.27లక్షలకు పైగా గర్భిణీలు కరోనా టీకా మొదటిడోసు వేయించుకున్నారని పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బంది ఇచ్చిన కౌన్సిలింగ్ ఫలితంగానే ఈ టీకా పంపిణీ జరిగిందని తెలిపింది. తమిళనాడులో అత్యధికంగా 78,838 గర్భిణీలు టీకా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 34,228, ఒడిశాలో 29,821 మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423, కర్ణాటకలో 16,673 మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. గర్భిణీలు టీకా తీసుకునేందుకు జులై 2న కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
అపోహల్ని కేంద్రం వెంటనే పరిష్కరించింది..
కరోనా టీకాలపై చక్కర్లు కొడుతోన్న తప్పుడు సమాచారం, అపోహల్ని కేంద్రం వెంటనే పరిష్కరించిందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. అలాగే ప్రస్తుతం దేశంలో టీకా కార్యక్రమం స్థిరమైన వేగంతో నడుస్తోందని చెప్పారు. జనవరిలో రోజుకు పంపిణీ రేటు 2.35లక్షలుగా ఉండగా.. జూన్‌లో అది 39.89లక్షలకు చేరిందన్నారు. నిన్న 52.99లక్షల మంది టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 46 కోట్ల మార్కును దాటిందని కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!