భారత్‌లో ఏటా 27లక్షల మరణాలకు ఇదే కారణం!

భారత్‌లో ప్రతి ఏడాది సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేనని ఓ నివేదిక తేల్చింది. అంటే ఏటా దాదాపు 27 లక్షల మంది విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నారు......

Published : 11 Feb 2021 04:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ప్రతి ఏడాది సంభవిస్తున్న మరణాల్లో 30.7 శాతం శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్లేనని ఓ నివేదిక తేల్చింది. అంటే ఏటా దాదాపు 27 లక్షల మంది విషతుల్యమైన గాలిని పీల్చడం ద్వారా చనిపోతున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, కాలేజ్‌ ఆఫ్ లండన్‌ విశ్వవిద్యాయంతో పాటు మరికొన్ని ప్రముఖ సంస్థలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. దీనికి సంబంధించిన వివరాలు ప్రముఖ ‘‘ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చి’’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

బొగ్గు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల సంభవించిన కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 2018లో 80 లక్షల మంది చనిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం వల్లేనని తెలిపింది. ఈ సంఖ్య అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక దుమ్ము, పొగ, కార్చిచ్చు, పంట వ్యర్థాల దహనం వల్ల గాల్లో కలిసిపోయే సూక్ష్మమైన రేణువుల వల్ల 42 లక్షల మంది చినపోతున్నట్లు వెల్లడించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వల్ల సంభవిస్తున్న మరణాల్లో భారత్‌, చైనాలోనే అత్యధికమని అధ్యయనం తెలిపింది. చైనాలో ఏటా 39.1 లక్షలు, భారత్‌లో 24.6 లక్షల మంది చినిపోతున్నట్లు పేర్కొంది. ఇక భారత్‌లో 2018లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 4,71,546 మంది, బిహార్‌లో 2,88,821 మంది చనిపోయినట్లు వెల్లడించింది. స్వచ్ఛ ఇంధనాల వినియోగమే మరణాలను తగ్గించడానికి ఉన్న ఏకైక మార్గమని అధ్యయనం అభిప్రాయపడింది.

ఇవీ చదవండి...

కొన్ని ఖాతాలను రద్దు చేయలేం: ట్విటర్‌

‘అంతర్జాతీయ శక్తిగా భారత్‌ను స్వాగతిస్తున్నాం’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని