E-Shram Portal: ఈ- శ్రమ్‌ పోర్టల్‌కు విశేష స్పందన.. రెండు నెలల్లోనే 5 కోట్లు దాటిన రిజిస్ట్రేషన్లు

అసంఘటిత రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు కేంద్రం ప్రారంభించిన ‘ఈ- శ్రమ్‌’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే దాదాపు అయిదు కోట్లకు పైగా కార్మికులు తమ వివరాలు...

Published : 27 Oct 2021 01:04 IST

దిల్లీ: అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు కేంద్రం ప్రారంభించిన ‘ఈ- శ్రమ్‌’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే దాదాపు అయిదు కోట్ల మందికి పైగా కార్మికులు ఇందులో తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిజిస్ట్రేషన్‌లలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌, మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయం, నిర్మాణ రంగాల నుంచి అత్యధిక సంఖ్యలో కార్మికులు నమోదయ్యారని తెలిపింది. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో దాదాపు 50.94 శాతం మహిళలే ఉండటం విశేషమని పేర్కొంది.

ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయోజనాలు పొందొచ్చు..

దేశవ్యాప్తంగా అసంఘటిత రంగాల కార్మికుల డేటాబేస్‌ను రూపొందించాలనే లక్ష్యంతో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 26న ఈ పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో వివరాలు నమోదు చేసుకున్న తర్వాత.. డిజిటల్ ఈ-శ్రమ్ కార్డు ఇస్తారు. దీనిద్వారా సంబంధిత కార్మికులు తమ వివరాలను పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ- శ్రమ్‌ కార్డుపై ఉన్న ప్రత్యేక ఖాతా సంఖ్య.. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. దీంతో వేరే ఇతర రాష్ట్రాల్లోనూ కార్మికులు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పోర్టల్‌లో నమోదైన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యంపై రూ.లక్ష బీమా వర్తిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు