పీఎంకేర్స్ ​నిధులతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ​ప్లాంట్లు

దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా 551 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం..........

Updated : 25 Apr 2021 16:12 IST

దిల్లీ: దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను అధిగమించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా 551 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్స్ నిధులను వినియోగించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. 

అన్ని జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వీలైనంత త్వరగా ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్లతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని కేంద్రం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని