PM Modi: కశ్మీర్‌లో మోదీ యోగా.. 7వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు!

అంతర్జాతీయ యోగా దినోత్సవరం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. 

Updated : 19 Jun 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాల్‌ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా.. ఆ కార్యక్రమంలో దాదాపు ఏడు వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్‌ లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

‘‘కశ్మీర్‌ ప్రజలతో మోదీకి మంచి అనుబంధం ఉంది. అందుకే ఆయన ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మోదీ రాక మాకెంతో గర్వకారణం. ఆ రోజు జరగబోయే కార్యక్రమంలో ఆయనతో పాటు 7 వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు.

అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు.. కాని జ్ఞానం కాదు: ప్రధాని మోదీ

‘‘గత పదేళ్లలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై యోగా ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో 23.5 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ఏటా యోగా చేసే వారి సంఖ్య పెరగడం హర్షణీయం. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కోసం ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు’’ అని జమ్మూకశ్మీర్‌ ఎల్‌జీ వెల్లడించారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిస్తోంది. దీంతో ఈ నెల 29న ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సిన్హా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని