CoronaVaccine: రాష్ట్రాల వద్ద ఎన్ని ఉన్నాయి?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అందరినీ భయపెడుతోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌నేషన్‌

Published : 06 May 2021 14:10 IST

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అందరినీ భయపెడుతోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు వ్యాక్సిన్‌నేషన్‌ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 89లక్షల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో మరో 28లక్షల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ఇప్పటి వరకూ రాష్ట్రాలలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 17.15 (17,15,42,410) కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉచితంగా అందించింది. ఇందులో మొత్తం 16.26 (16,26,10,905) కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌(వృథా అయిన వ్యాక్సిన్‌లతో కలిపి)లను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు. ‘ఈ లెక్కన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 89లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో వినియోగం కూడా అధికంగానే ఉంది. కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు సరిగా సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల వ్యాక్సిన్‌ కొరత కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో 28లక్షల వ్యాక్సిన్‌లు అందిస్తాం’ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను కేంద్రం సవరించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ పోర్టల్‌/ఆరోగ్యసేతులలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా దగ్గరిలోని ఆరోగ్య కేంద్రం వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని