Job vacancies: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు.. పోస్టుల జాబితా ఇదే..!
కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని పలు మంత్రిత్వశాఖలు, విభాగాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు(Job vacancies) ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని పలు మంత్రిత్వశాఖలు, విభాగాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు(Job vacancies) ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం(Union Government) వెల్లడించింది. 2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 9.79లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. వీటిలో రైల్వేలో అత్యధికంగా 2.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా.. రక్షణ శాఖలో 2.64లక్షలు, హోంశాఖలో 1.43లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. భాజపా ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ రాజ్యసభ(Rajya sabha)లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్( Jitendra Singh) లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
దేశంలో ప్రస్తుతం కొనసాగుతోన్న ‘రోజ్‌గార్ మేళా’(Rozgar Mela) వివిధ శాఖల్లో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని.. ఒక ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ కాలంలో 10లక్షల మంది యువతకు అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశామన్న ఆయన.. ఉత్తమ పద్ధతుల్ని అమలుచేసేందుకు కేంద్రం, రాష్ట్రాల్లో రిక్రూట్‌మెంట్ వ్యవస్థలపై సమగ్రమైన అధ్యయనం చేసిందన్నారు.
శాఖల వారీగా పోస్టులను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!