Pariksha Pe Charcha: ‘పరీక్షా పే చర్చ’.. గత ఐదేళ్లలో చేసిన ఖర్చెంతంటే?

2018 నుంచి ఏటా ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తోన్న పరీక్షా పే చర్చ(Pariksha Pe Charcha)కార్యక్రమం ఖర్చుల వివరాలను కేంద్రం వెల్లడించింది.

Published : 06 Feb 2023 18:33 IST

దిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏటా నిర్వహిస్తోన్న ‘పరీక్షా పే చర్చ’(Pariksha Pe Charcha) కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018 నుంచి ఇప్పటివరకు ఆరు ఈవెంట్లు జరగ్గా.. ఐదు ఎడిషన్లకు రూ.28 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు లోక్‌సభ(Lok sabha)కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి వివరాలు వెల్లడించారు. 2018లో తొలిసారి నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి రూ.3.67 కోట్లు ఖర్చు కాగా.. 2019లో రూ.4.93 కోట్లు, 2020లో రూ.5.69 కోట్లు, 2021లో రూ.6కోట్లు, 2022లో రూ.8.61 కోట్లు వెచ్చించినట్టు పేర్కొన్నారు. ఇటీవల జనవరి 27న దిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అయిన ఖర్చుల వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.

2018 ఫిబ్రవరి 16న తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులతో పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 38లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా.. గతేడాది 15లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రిజిస్టర్‌ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని