Oxygen:397 రైళ్లు.. 28వేల మెట్రిక్‌ టన్నులు!

రోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చడంతో దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు భారతీయ రైల్వే సంస్థ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో ప్రాణ వాయువును సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు....

Published : 09 Jun 2021 22:37 IST

దిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చడంతో దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు భారతీయ రైల్వే సంస్థ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో ప్రాణ వాయువును సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు 28వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఆక్సిజన్‌ అందక రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 397 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో 1628 ట్యాంకుల ద్వారా రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను అందించి ఉపశమనం కలిగించినట్టు పేర్కొంది. ఇప్పటివరకు భారతీయ రైల్వేల ద్వారా 28,060 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయగా.. మహారాష్ట్రకు 614 మెట్రిక్‌ టన్నులు, యూపీ 3,797, మధ్యప్రదేశ్‌ 656, దిల్లీ 5,722, హరియాణా 2,354, రాజస్థాన్‌ 98, కర్ణాటక 3450, ఉత్తరాఖండ్‌ 320, తమిళనాడు 3,972, ఆంధ్రప్రదేశ్‌ 3,130, పంజాబ్‌ 225, తెలంగాణ 2,765, కేరళ 513, జార్ఖండ్‌ 38, అసోంకు 400 మెట్రిక్‌ టన్నుల చొప్పున సరఫరా చేసినట్టు వివరించింది. దాదాపు 45 రోజుల క్రితం ఏప్రిల్‌ 24న తొలి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచి 126 మెట్రిక్‌ టన్నుల ప్రాణవాయువుతో మహారాష్ట్రకు వెళ్లిందని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కోరగానే సాధ్యమైనంత తక్కువ సమయంలోనే ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని