ECI: ఆ 5 రాష్ట్రాల్లో పార్టీలకు ఇక పండగే!

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఊరట కల్పించింది. ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధాజ్ఞలకు మరోసారి సడలింపులు ఇచ్చింది. ఎన్నికలున్న ఐదు ....

Published : 12 Feb 2022 21:17 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం మరింత ఊరట కల్పించింది. ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధాజ్ఞలకు మరోసారి సడలింపులు ఇచ్చింది. ఎన్నికలున్న ఐదు రాష్ట్రాల్లో (యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌) బహిరంగంగాను, సమావేశ మందిరాల్లోనూ ఎన్నికల సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు నిర్వహించుకొనేందుకూ పచ్చజెండా ఊపింది. అలాగే, రాజకీయ పార్టీలు/అభ్యర్థులు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చని స్పష్టంచేసింది. ప్రచారంపై గతంలో విధించిన నిషేధ సమయాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. ప్రచారంపై రాత్రి 8గంటల నుంచి ఉదయం 8గంటల వరకు నిషేధం ఉండగా.. ఆ సమయాన్ని తాజాగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటలకు కుదిచింది. బహిరంగ మైదానాల్లో 50శాతం మంది లేదా జిల్లా ఎన్నికల అధికారి నిర్దేశించిన పరిమిత సంఖ్యలో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ముందస్తు అనుమతితో జిల్లా అధికారుల నిర్దేశించిన సంఖ్యను మించకుండా పాదయాత్రలు సైతం నిర్వహించుకోవచ్చని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని