Padma awards2023: చినజీయర్‌ స్వామికి పద్మభూషణ్‌.. కీరవాణికి పద్మశ్రీ

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది.

Updated : 25 Jan 2023 23:21 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవం(Republic Day celebrations) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల(Padma awards)ను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి(Chinna Jeeyar Swamy),  కమలేశ్‌ డి పటేల్‌(Kamlesh Patel) పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani)ని పద్మశ్రీ వరించింది. స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం); సినీనటి రవీనా టాండన్‌(Raveena Tandon)తో సహా పలువురిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు..

తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్‌ గుప్తా(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం); హనుమంతరావు పసుపులేటి(వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు); గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర; అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌); సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్‌); ;సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ); ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగంలో)లను పద్మశ్రీ వరించింది.

ములాయం సింగ్‌, జాకీర్‌ హుస్సేన్‌లకు పద్మవిభూషణ్‌

  • బాలకృష్ణ జోషీ (మరణానంతరం)- ఆర్కిటెక్ రంగం- గుజరాత్‌
  • ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ (కళలు)- మహారాష్ట్ర
  • కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ (పబ్లిక్‌ అఫైర్స్‌) 
  • దిలీప్ మహాలనబిస్‌ (మరణానంతరం) - వైద్యరంగం -బెంగాల్‌
  • శ్రీనివాస్‌ వర్థన్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్)- ఎన్నారై
  • ములాయం సింగ్‌ యాదవ్‌ (మరణానంతరం) -పబ్లిక్‌ అఫైర్స్‌ విభాగం 

సుధామూర్తి, కుమార మంగళం బిర్లా, వాణీ జయరాంకు పద్మభూషణ్‌

  • ఎస్.ఎల్‌.భైరప్ప (లిటరేచర్‌, విద్య) - కర్ణాటక
  • కుమార మంగళం బిర్లా (వాణిజ్యం)- మహారాష్ట్ర
  • దీపక్‌ ధార్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగఠ్‌ )- మహారాష్ట్ర
  • వాణీ జయరాం (కళలు) -తమిళనాడు
  • చినజీయర్‌ స్వామి (ఆధ్యాత్మికం)- తెలంగాణ
  • సుమన్‌ కల్యాణ్‌పూర్‌ (కళలు)- మహారాష్ట్ర
  • కపిల్‌ కపూర్‌ (లిటరేచర్‌, విద్య)-దిల్లీ
  • సుధామూర్తి (సామాజిక సేవ) -కర్ణాటక
  • కమలేశ్‌ డి పటేల్‌ (ఆధ్యాత్మికం) -తెలంగాణ
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని