Nanda Master: పద్మశ్రీ గ్రహీత నందా ప్రస్తీ ఇకలేరు

ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు నందా ప్రస్తీ (104)  మంగళవారం కన్నుమూశారు.  ఒడిశాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ........

Published : 07 Dec 2021 22:03 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు నందా ప్రస్తీ (104)  మంగళవారం కన్నుమూశారు.  ఒడిశాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సామాజిక సేవ, విద్యారంగంలో ఆయన అందించిన నిరుపమాన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ పురస్కారంతో గౌరవించింది. నందా ప్రస్తీ మాస్టర్‌ మరణవార్త తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఒడిశా నుంచి వచ్చి విద్యారంగంలో సేవలందించిన ‘నందా సర్‌’ తరతరాలకు గుర్తుండిపోతారు. కొన్ని వారాల క్రితం పద్మ అవార్డు వేడుకల్లో ఆయన దేశం దృష్టిని ఆకర్షించి అందరి అభిమానాన్నీ పొందారు. ఆయన మరణవార్త నన్ను బాధించింది. ఓం శాంతి’’ అని ట్వీట్‌ చేశారు. ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన నందకిశోర్‌ మాస్టర్‌ కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఏడో తరగతిలోనే పాఠశాల విద్యకు దూరమయ్యారు. తనకు జరిగినట్టు ఇతరలకు జరగకూడదనే ఉద్దేశంతో 82ఏళ్ల పాటు గ్రామీణ బాలికలకు, ప్రజలకు విద్యాబోధన చేశారు. పైసా తీసుకోకుండా ఉచితంగా పాఠాలు చెప్పిన మాస్టర్‌గా పేరొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని