Updated : 08 Nov 2021 16:17 IST

Padma Awards: ‘పద్మభూషణ్‌’ అందుకున్న పీవీ సింధు

పద్మశ్రీ అవార్డును స్వీకరించిన కంగనా రనౌత్‌, అద్నాన్‌ సమీ

అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

దిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో సోమవారం అట్టహాసంగా జరిగింది. 2020 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను నేడు ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గ్రహీతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భారత స్టార్‌ షట్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించగా.. ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

2020 ఏడాదికి మొత్తం 118 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసిన  విషయం తెలిసిందే. వీరిలో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 16 మందికి పద్మభూషణ్‌ మిగతా వారికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. మరణానంతరం జార్జి ఫెర్నాండెస్‌, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌, విశ్వేశ్వరతీర్థ స్వామీజీలకు పద్మవిభూషణ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీరితో పాటు పండిత్‌ చెన్నూలాల్‌ మిశ్రా, మేరికోమ్‌, అనిరుధ్‌ జుగ్‌నౌద్‌ మిశ్రాలను పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపిక చేసింది. 

ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, పీవీ సింధూ, మనోహర్‌ పారికర్‌(మరణానంతరం) సహా 16 మందికి పద్మభూషణ్‌ ప్రకటించింది. ప్రముఖ నటి కంగనా రనౌత్‌, గాయకుడు అద్నాన్‌ సమీ, నిర్మాతలు ఏక్తా కపూర్‌, కరణ్‌ జోహార్‌, క్రీడాకారుడు జహీర్‌ ఖాన్‌ తదితరులను పద్మశ్రీ వరించింది. వీరంతా నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్