Pak: పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌

నియత్రణ రేఖ వద్ద పాక్‌ అరాచకాలు ఆగడంలేదు. సరిహద్దు ఆవలివైపు నుంచి భారత్‌లోకి మత్తు పదర్థాలు, ఆయుధాలను డ్రోన్ల సాయంతో పంపిస్తోంది

Published : 10 Feb 2022 01:41 IST

అమృత్‌సర్‌: నియంత్రణ రేఖ వద్ద పాక్‌ అరాచకాలు ఆగడంలేదు. సరిహద్దు ఆవలివైపు నుంచి భారత్‌లోకి మత్తు పదార్థాలు, ఆయుధాలను డ్రోన్ల సాయంతో పంపిస్తోంది. తాజాగా అటువంటి ప్రయత్నాన్ని పంజాబ్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ అడ్డుకొంది. పాక్‌ నుంచి వచ్చిన డ్రోన్‌ను కూల్చేసింది. ఈ ఘటన అర్థరాత్రి ఒంటిగంట సమయంలో గురుదాస్‌పూర్‌ సెక్టార్‌లో పంజ్‌గ్రయిన్‌లో చోటు చేసుకొంది. 

అనంతరం బీఎస్‌ఎఫ్‌ దళాలు ఘాగ్రా, సింఘోకె గ్రామాల వద్ద తనిఖీలు నిర్వహించగా పసుపు పచ్చ రంగులోని పొట్లాల్లో ఉన్న మత్తుపదార్థాన్ని గుర్తించారు. దానికి 20 మీటర్ల దూరంలోనే డ్రోన్‌ను గుర్తించారు. ఈ ఘటన సరిహద్దుకు 2.7 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకొంది. దళాలు స్వాధీనం చేసుకొన్న కవర్లలో ఒక పిస్తోల్‌ కూడా లభించింది. 

భారత్‌లోకి ఆయుధ సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ పంజాబ్‌ మార్గాన్ని అధికంగా వినియోగిస్తోంది. ఈ మార్గంతో పోలిస్తే రాజస్థాన్‌, గుజరాత్‌ల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ లెక్కల ప్రకారం అంతకు ముందుతో పోలిస్తే డ్రోన్ల చొరబాట్లు దాదాపు 450శాతం పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని