భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ఇమ్రాన్
కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ
ఇస్లామాబాద్: కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘కరోనా వైరస్ రెండో దశపై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. పొరుగుదేశం సహా ఇతర అన్ని దేశాలు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాలుపై అందరూ కలసికట్టుగా యుద్ధం చేయాలి’ అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్‌లో పిలుపునిచ్చారు.
భారత్‌లో కరోనా వైరస్ రెండోదశ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం లక్షలాది మంది కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 1,89,544 మంది ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల అధినేతలు భారత్ పట్ల సంఘీభావం ప్రకటించారు. భారత్‌కు ఏవిధంగానైనా సాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ts-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!