
Taliban: తాలిబన్ల రెండో ఇల్లు పాకిస్థాన్ ... జైబుల్లా ముజాహిద్ ప్రకటన
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘పాకిస్థాన్ మా తాలిబన్లకు రెండో ఇల్లు వంటిది. ఆ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ గ్రూపు మా భూభాగాన్ని వినియోగించుకోనీయం’’ అని తాలిబన్ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. పాక్-అఫ్గాన్‌లు సరిహద్దులు పంచుకుంటాయన్నారు. మతం విషయానికి వస్తే మా రెండు దేశాలు సహజ మిత్రులని తెలిపారు. భవిష్యత్తులో పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకొనే అంశంపై మేము దృష్టిపెడతాము.
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంలో పాక్ పాత్ర ఏమాత్రం లేదని జైబుల్లా పేర్కొన్నారు. ఆ దేశం మా అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో అఫ్గానిస్థాన్ మంచి సంబంధాలు కోరుకుంటోందన్నారు. అఫ్గాన్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే భారత్ తన విధానాన్ని నిర్ణయించుకొంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అఫ్గాన్ గడ్డపై ఐసిస్ లేదని జైబుల్లా తేల్చి చెప్పారు. ఇక భారత్-పాక్‌ల మధ్య ఉన్న సమస్యలు వారు చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు.
టీటీపీతో భయం..
అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించారని పాక్ సంతోషించినా.. తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఎక్కడ పుంజుకొంటుందో అని భయపడుతోంది. పాకిస్థాన్‌లో ఇది అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థగా దీనికి గుర్తింపు ఉంది. ఈ సంస్థ అక్కడ పలు భారీ దాడులకు కారణమైంది. 2011లో కరాచీలో అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసింది. 2014లో ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై దాడి చేసి పిల్లలతో సహా 150 మందిని చంపేసింది.
2007లో ఈ సంస్థను ఖైబర్ పక్తూన్‌క్వాలో బైతుల్లా మెహ్‌సూద్ స్థాపించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య తర్వాత వేగంగా పుంజుకొంది. మెహసూద్‌కు అఫ్గాన్ తాలిబన్, అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009నాటికి ఈ సంస్థ పుంజుకొంటున్న సమయంలో డ్రోన్ దాడిలో చనిపోయాడు. అతని వారసుడు హకీముల్లా మెహసూద్ కూడా 2013లో ఒక డ్రోన్ దాడిలో చనిపోయాడు. ఆ తర్వాత టీటీపీ వర్గాలుగా విడిపోయింది. దానికి ముల్లా ఫజలుల్లాను నాయకుడిగా ఎంచుకొన్నారు. అదే సమయంలో పాకిస్థాన్ భద్రతా దళాలు దాడులను పెంచాయి. పాక్‌కు అమెరికా నుంచి డ్రోన్ల రూపంలో సాయం కూడా అందింది. ఈ ఆపరేషన్‌కు జెర్బ్-ఇ-అజబ్ అనే పేరుపెట్టారు. దీంతో ఆ బృందం బలహీనపడింది. మధ్యశ్రేణి నాయకులు అఫ్గానిస్థాన్‌కు పారిపోయారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: ఆ సమయంలో.. పుతిన్ కాన్వాయ్ ఎందుకు వెళ్లింది..?
-
Politics News
AIMIM: సిన్హాకే మజ్లిస్ మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ ప్రకటన
-
Technology News
Gmail: ఇకపై ఆఫ్‌లైన్‌లో జీమెయిల్ సేవలు.. ఎలా పొందాలంటే?
-
World News
Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్
-
Movies News
Director maruthi: చిరంజీవి, ప్రభాస్‌లతో సినిమా కచ్చితంగా ఉంటుంది: దర్శకుడు మారుతి
-
India News
Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్