Pakistan: ఐఎంఎఫ్‌తో చర్చలకు సిద్ధమవుతున్న పాక్‌..!

నిధులు లేక కటకటలాడుతున్న పాకిస్థాన్‌ మరో అప్పు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐఎంఎఫ్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకొనేందుకు చర్చలు మొదలుపెట్టింది.

Published : 03 Oct 2021 19:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిధులు లేక కటకటలాడుతున్న పాకిస్థాన్‌ మరో అప్పు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐఎంఎఫ్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకొనేందుకు చర్చలు మొదలుపెట్టింది. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి ఐదు రోజులపాటు ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ఫలవంతమైతే పాకిస్థాన్‌కు తక్షణమే బిలియన్‌ డాలర్ల రుణం లభిస్తుంది. 

2019లో పాక్‌-ఐఎంఎఫ్‌ మధ్య 6 బిలియన్‌ డాలర్ల రుణం కోసం ఒప్పందం జరిగింది. కానీ, 2020 జనవరిలో నిలిచిపోయింది. కానీ, ఈ ఏడాది మార్చిలో మళ్లీ దీనిని పునరుద్ధరించారు. జూన్‌-ఆగస్టు మధ్యలో పెద్దగా చర్చలు ఏమీ జరగలేదు. తాజాగా పాక్‌ ఆర్థిక మంత్రి షౌకత్‌ తారిన్‌ ఈ చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటి వరకు ఐఎంఎఫ్‌ కూడా చర్చలకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఐఎంఎఫ్‌ మీటింగ్‌ జరగనుంది. ఈ సమయంలో పాక్‌ స్టేట్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఐఎంఎఫ్‌ అధికారులతో భేటీ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌ ఉండటంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సాయం రావడం గగనకుసుమమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని