టిక్‌టాక్‌ను నిషేధించండి.. పాక్‌ కోర్టు..!

యువతలో మంచి క్రేజ్‌ సంపాదించిన టిక్‌టాక్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే భారత్‌, అమెరికా దేశాలు ఈ యాప్‌పై నిషేధం విధించగా... తాజాగా పాకిస్థాన్‌లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ(పీటీఏ) ఆదేశాలు జారీ చేసింది...

Published : 11 Mar 2021 20:23 IST

ఇస్లామాబాద్‌‌: యువతలో మంచి క్రేజ్‌ సంపాదించిన టిక్‌టాక్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే భారత్‌, అమెరికా దేశాలు ఈ యాప్‌పై నిషేధం విధించగా... తాజాగా పాకిస్థాన్‌లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ(పీటీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌పై అనైతిక/అసభ్యకరమైన సమాచారానికి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అధికార ప్రతినిధి ఖుర్రమ్‌ మెహ్రాన్‌ గురువారం తెలిపారు. దేశ సమాచార భద్రత, గోప్యత దృష్ట్యా పెషావర్‌లోని  కోర్టు యాప్‌ను బ్యాన్‌ చేయాలని తీర్పునిచ్చినట్లు  చెప్పారు. అయితే స్థానిక చట్టాల నియమాలకు లోబడి యాప్‌ను నియంత్రిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని