Intelligence Alert: పండుగలే లక్ష్యం.. 40మంది ఉగ్రవాదులు చొరబడేందుకు పన్నాగం!

రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. మన దేశంలోకి ......

Published : 24 Sep 2021 01:22 IST

దిల్లీ: రాబోయే పండుగ రోజుల్లో దేశంలో భారీ దాడులకు తెగబడేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. మన దేశంలోకి చొరబడేందుకు 40 మంది అఫ్గాన్‌ ఉగ్రవాదులు పన్నాగాలు రచిస్తున్నట్టు తెలిపింది. పాక్‌ మద్దతుతో దేశంలోకి చొరబడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించింది. పాక్‌లోని ఐఎస్‌ఐ అండతో సరిహద్దులు దాటేందుకు అఫ్గాన్‌ మూకలు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. వీరికి ఐఎస్‌ఐ టిఫిన్‌బాంబుల తయారీలో పాక్‌ శిక్షణ ఇచ్చిందని అప్రమత్తంచేసింది.  జమ్మూకశ్మీర్‌లోకి చొరబడి దాడులు చేయవచ్చని హెచ్చరించింది. ఈ మేరకు పారామిలటరీ, రాష్ట్ర పోలీసులను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ముష్కరుల కదలికలపై పక్కా సమాచారం ఉందని వెల్లడించాయి.

ఉరీ సెక్టార్‌ వద్ద ముగ్గురు ముష్కరుల హతం!

మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో పాక్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను సైన్యం భగ్నం చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వద్ద హత్లాంగ ప్రాంతంలో అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించి ముష్కరులను హతమార్చినట్టు తెలిపారు. వారి నుంచి ఐదు రైఫిళ్లు, ఏడు పిస్తోళ్లు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని