CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన
parliamentary committee On CBI: సీబీఐ అధికారాలు, విధులు నిర్దేశిస్తున్న చట్టంలో కొన్ని పరిమితులు ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఒకటి అభిప్రాయపడింది. అందుకే కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది.
దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలో అధికారంలో ఉన్నవారు పావులుగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ముఖ్యంగా సీబీఐని రాజకీయ కక్ష్య సాధింపుల కోసం కేంద్రంలో సర్కారు వాడుకుంటోందని ఆరోపిస్తుంటాయి. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) విచారణలను కొన్ని రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయి. ఇందుకోసం సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారాలు, పరిధులు నిర్దేశిస్తూ కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ ఒకటి అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తుచేసింది.
1963లో సీబీఐ ఏర్పాటైంది. దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DSPE) యాక్ట్ కింద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టం కింద సీబీఐ ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థను కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో అంతకుముందు ముందు ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటున్నాయి. ఇప్పటికే 9 రాష్ట్రాలు సమ్మతిని వెనక్కి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సూచనలు చేసింది.
దిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి కొత్తగా చట్టం చేసి సీబీఐ అధికారులు, విధులు, పరిధి నిర్దేశించాలని సూచించింది. సీబీఐ నిష్పాక్షికతను పాదుగొల్పాలని తన నివేదికలో పేర్కొంది. అలాగే సీబీఐ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలంది. సీబీఐలో ప్రస్తుతం 1709 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేసింది. ఖాళీల వల్ల కేసుల దర్యాప్తులో నాణ్యత లోపిస్తోందని అభిప్రాయపడింది.
డిప్యూటేషన్లపై ఆధారపడకుండా శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలని గతంలో ఇదే కమిటీ సూచించగా.. అందుకు సీబీఐ తనదైన కారణాలను కమిటీ ముందు ఉంచింది. డిప్యూటేషన్ల వల్ల కలిగే లాభాలతో పాటు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విషయంలో ఉన్న నష్టాలను కమిటీకి తెలియజేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కమిటీ.. డిప్యూటేషన్ రిక్రూట్‌మెంట్‌ను మాత్రం పరిమితం చేయాలని సూచించింది. అలాగే, కేసుల దర్యాప్తునకు సంబంధించిన పురోగతిని పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని సూచించింది. వార్షిక నివేదికలు సైతం సాధారణ ప్రజలకు అందుబాటులో లేవని తెలిపింది. పారదర్శకత కోసం కేసుల వివరాలు, వార్షిక నివేదికలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సీబీఐకి సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన విచారణ
-
TCS: భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
-
Karnataka Bandh: ‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు