Published : 30 Jan 2022 17:07 IST

Parliament: సోమవారం ప్రారంభంకానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు!

దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే 2021-22ను ప్రవేశపెట్టనున్నారు. మరుసటి రోజు(ఫిబ్రవరి 1)న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలి దశ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరుగుతాయి. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. ఇరు సభల్లో సమావేశాలపై చర్చిస్తారు. 

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించగా.. మరోవైపు పార్లమెంట్‌ వేదికగా దేశంలోని పలు సమస్యలపై ప్రశ్నలు సంధించి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. రైతులు, సాగు ఇబ్బందులు, చైనా చొరబాట్లు, పెగాసస్‌ స్పైవేర్‌, ఎయిర్‌ ఇండియా విక్రయం, కొవిడ్‌ బాధితులకు రిలీఫ్‌ ప్యాకేజీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని విపక్ష నేతలు నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా.. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో(ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరఖండ్‌)లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్‌ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని