Parliament session: జూన్‌ 24న కొలువుదీరనున్న కొత్త లోక్‌సభ..

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీంతో కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయడానికి తేదీలు ఖరారయ్యాయి. 

Updated : 12 Jun 2024 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పార్లమెంట్‌లో సరికొత్తగా ఎన్నికైన 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ విషయాన్ని పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జులై 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో (Parliament session) స్పీకర్‌ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఇతర కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. రాజ్యసభ 264వ సెషన్‌ 27వ తేదీన ప్రారంభం కానున్నట్లు వివరించారు. 

జూన్‌ 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈసందర్భంగా వచ్చే ఐదేళ్లకు ప్రభుత్వ రోడ్‌ మ్యాప్‌ను ఆమె వెల్లడించనున్నారు. అనంతరం రాష్ట్రపతి గత ప్రభుత్వ విజయాలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తొలి పార్లమెంట్‌ సెషన్‌లో ప్రభుత్వాన్ని పలు అంశాల్లో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. 

2024 ఎన్నికలలో భాజపా ఈసారి 240 సీట్లలో విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాలపై జేడీయూ, తెదేపాతో కలిసి ఎన్‌డీఏ సర్కారును ఏర్పాటుచేసింది. ఇటీవలే ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని