Parliament: మోదీ విజన్‌ వల్లే జీ20 గ్రాండ్‌ సక్సెస్‌: స్పీకర్‌

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Updated : 18 Sep 2023 11:36 IST

దిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్‌ వారిని వారించారు. అనంతరం జీ20 సదస్సు విజయవంతమవడంపై స్పీకర్‌(Lok Sabha Speaker Om Birla) అభినందనలు తెలియజేశారు.

‘జీ 20 సదస్సు (G20 Summit) విజయవంతం చేసిన ప్రధాని మోదీకి అభినందనలు. జీ20 ద్వారా మన ప్రజాస్వామ్య శక్తి ప్రపంచానికి తెలిసింది. మోదీ విజన్, సమర్థత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని స్పీకర్‌ కొనియాడారు. గాంధీజీ ప్రబోధించిన శాంతి, అహింస మనకు ఎప్పుడూ స్పూర్తినిస్తుంటాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డిజిటలైజేషన్ దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందంటూ డిజిటల్ ఇండియా గురించి ప్రస్తావించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందంటూ.. వివిధ రంగాల్లో దేశం సాధిస్తోన్న పురోగతి గురించి వెల్లడించారు. 

ఈ ‘ప్రత్యేక’ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు: ప్రధాని మోదీ

మరోపక్క.. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’పార్టీ నేతలు ఈ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా  పలు పార్టీలకు చెందిన నేతలు సెషన్‌కు వచ్చారు.  అలాగే సమావేశాల ప్రారంభం రోజున భాజపా నేత దినేశ్‌ శర్మ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని