నిర్లక్ష్యం చేస్తే..‘నో ఫ్లై’ జాబితాలోకే

దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది.

Published : 26 Mar 2021 14:58 IST

కరోనా: విమాన ప్రయాణికులకు కేంద్రం హెచ్చరిక

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే విమాన ప్రయాణికులపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. వారిని ‘నో-ఫ్లై’ జాబితాలో చేర్చుతున్నట్లు తెలిపింది. దీనిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం వెల్లడించారు.

‘మనం కొవిడ్-19పై చేసే పోరాటంలో విజయం సాధించగలం. కానీ, కొందరి నిర్లక్ష్యం సమస్యలను తెచ్చిపెడుతోంది. కొవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికులను ‘నో-ఫ్లై’ జాబితాలో చేర్చుతూ చర్యలు ప్రారంభించాం’ అని హర్దీప్ సింగ్ వెల్లడించారు. కాగా, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు 60వేలకు చేరువయ్యాయి. తాజాగా 59,118 మందికి వైరస్ సోకగా..257 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని