Corona: అలాంటప్పుడు టీకా అదనపు రక్షణ

గతంలో ఒకసారి కరోనా సోకిన యువకులు మరోసారి కరోనా బారిన పడే అవకాశం ఉందని ది లాన్సెట్‌ లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ అధ్యయనాల్లో తేలింది.

Published : 29 Apr 2021 23:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో ఒకసారి కరోనా సోకిన యువకులు మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉందని ది లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ అధ్యయనాల్లో తేలింది. అమెరికాలోని మెరైన్స్‌ సైన్యంలోని 18-20 ఏళ్ల వయసున్న మూడు వేలకుపైగా యువకులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్‌ సోకిన యువకులు మళ్లీ వైరస్‌ సోకే అవకాశముందని, అది ఇతరులకు  వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా బారిన పడి కోలుకున్న యువకుల్లో రోగ నిరోధక శక్తి పెరుతుందని కచ్చితంగా చెప్పలేమని పరిశోధకులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నా యాంటీబాడీస్‌ తక్కువగా ఉండేవాళ్లకు సార్స్‌-కొవ్‌2 సోకే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ క్రమంలో టీకా అదనపు రక్షణగా పనిచేస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. అలాగే 65 ఏళ్ల వయసు పైబడినవారు వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94 శాతం తప్పినట్లేనని అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం చేసిన అధ్యయనంలో తేలిన విషయం విదితమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని