ఆసుపత్రిని వదిలి వెళ్లలేను డాక్టర్‌!.. కదిలించిన వృద్ధుడి విన్నపం

తనకు ప్రేమగా వైద్య సేవలందించి రోగం నయం చేసిన వైద్యుడిని వదిలి వెళ్లలేనంటూ ఓ వృద్ధుడు చేసుకున్న విన్నపం ఆసుపత్రి వర్గాలను కదిలించిన ఘటన ఇది.

Updated : 03 Dec 2022 09:16 IST

తనకు ప్రేమగా వైద్య సేవలందించి రోగం నయం చేసిన వైద్యుడిని వదిలి వెళ్లలేనంటూ ఓ వృద్ధుడు చేసుకున్న విన్నపం ఆసుపత్రి వర్గాలను కదిలించిన ఘటన ఇది. కర్ణాటకలోని బీదర్‌ జిల్లాకు చెందిన రాజురామ్‌ గౌడ అనే వృద్ధుడ్ని అతని కుమారుడు మూడేళ్ల క్రితం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విడిచిపెట్టారు. దీంతో అక్కడే ఆ పెద్దాయన భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా ఆరోగ్యం దెబ్బతిని కదలలేని స్థితిలో ఉన్న రాజును.. డాక్టర్‌ బాలాసాహెబ్‌ శిందే గుర్తించి ఆసుపత్రిలో చేర్పించి.. అతడికి అన్ని పరీక్షలు చేసి తగిన వైద్యం అందించారు. 27 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి.. కోలుకున్న ఆయనకు ఆ వైద్యుడిని, ఆసుపత్రిని వదిలి వెళ్లేందుకు మనసొప్పలేదు. తాను అక్కడే ఉంటానంటూ వేడుకున్నాడు. దీంతో వైద్యబృదం ఆయనకు నచ్చజెప్పి.. దగ్గరుండి మరీ రాజును ఓ ఆశ్రమంలో చేర్పించింది. అక్కడ నుంచి వెళ్లే సమయంలో రాజు కన్నీటితో అందరికీ వీడ్కోలు పలికాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని