దేశం కోసమే రైతుల శాంతియుత ఉద్యమం

నూతన వ్యవసాయ చట్టాల ద్వారా దేశాలనికి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారన్నారు.

Updated : 14 Jan 2022 13:18 IST

ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల ద్వారా దేశానికి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. వీటి నుంచి దేశాన్ని రక్షించేందుకే రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్‌ చేయడంతో పాటు సరిహద్దుల్లో తమపై వేధింపులు ఆపాలంటూ శనివారం రైతులు దేశవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ‘చక్కాజామ్‌’ పేరుతో దేశవ్యాప్తంగా 12-3 గంటల మధ్య రహదారులను దిగ్బంధిస్తామని వారు సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్‌ చేసి, రైతులకు మద్దతు తెలిపారు. ‘‘ దేశ ప్రయోజనాల కోసం రైతులు శాంతియుత సత్యాగ్రహం చేస్తున్నారు. ఈ నూతన చట్టాల వల్ల రైతులకే కాదు దేశానికే ప్రమాదం. రైతులకు పూర్తిగా మద్దతిస్తున్నా.’’ అని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు. రైతుల నిరసన చేస్తున్న సరిహద్దుల వద్ద పలు వరుసల బారికేడ్లను ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు. కాగా రైతుల ఉద్యమానికి తమ మద్దతును కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు రైతులకు మద్దతుగా నిలుస్తారని తెలిపారు.

ఈ రోజు ఉదయం ఒక మీడియా రిపోర్టును రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. అందులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత  దేశంలో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంటగ్యాస్‌ ధరలు పెరిగాయని ఉంది. మోదీ ప్రభుత్వం దేశ బడ్జెట్‌తో పాటు సామాన్య గృహాల బడ్జెట్‌కు కూడా భంగం కలిగించిందని ఆయన వ్యాఖ్యను జత చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని