అమెరికా హౌస్‌ స్పీకర్‌గా మళ్లీ నాన్సీ పెలోసీ

‘హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌’ స్పీకర్‌గా డెమోక్రాటిక్‌ అభ్యర్థి నాన్సీ పెలోసీ మరోసారి ఎన్నికయ్యారు.

Published : 05 Jan 2021 02:19 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్య ప్రజా ప్రతినిధుల సభ ‘హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌’ స్పీకర్‌గా డెమోక్రాటిక్‌ అభ్యర్థి నాన్సీ పెలోసీ మరోసారి ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాకు చెందిన పెలోసీ ఈ అత్యున్నత పదవిని అలంకరించిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డు సృష్టించారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం సామాజిక దూరాన్ని పాటిస్తూ జరిగిన స్పీకర్‌ ఎన్నిక సుదీర్ఘకాలం కొనసాగింది. దీనిలో 216-209 వోట్లు గెల్చుకొంది. నాన్సీ తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ నేత కెవిన్‌ మెక్‌ కార్తీ (209)పై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

ఈ సందర్భంగా 80 ఏళ్ల నాన్సీ పెలోసీ మాట్లాడుతూ ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో నూతన కాంగ్రెస్‌ను ప్రారంభించనున్నామని అన్నారు. అమెరికాలో కొవిడ్‌-19 విజృంభణ వల్ల ఇప్పటికి మూడున్నర లక్షల మందికి పైగా మరణించగా.. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ తక్షణ కర్తవ్యం కరోనా మహమ్మారిని ఓడించటమే అని.. దానిలో విజయం సాధిస్తామని స్పీకర్‌గా ఎన్నికైన పెలోసీ విశ్వాసం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై పెలోసీ అభిశంసన అభియోగం మోపటంతో వారిద్దరి మధ్య మొదలైన వైరం.. గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది.

ఇవీ చదవండి..

ఓట్లు కావాలంటూ ట్రంపరితనం

ఏడోసారి చర్చలు.. ఉద్యమం ముగిసేనా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని