Pema Khandu: అరుణాచల్‌ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం

భాజపా నేత పెమా ఖండూ అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వరసగా మూడోసారి ప్రమాణం చేశారు. గురువారం ఈటానగర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కె.టి.పర్నాయక్‌ ఆయనతో, మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించారు.

Published : 14 Jun 2024 05:48 IST

పెమా ఖండూతో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎంగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ కె.టి.పర్నాయక్‌

ఈటానగర్‌: భాజపా నేత పెమా ఖండూ అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వరసగా మూడోసారి ప్రమాణం చేశారు. గురువారం ఈటానగర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కె.టి.పర్నాయక్‌ ఆయనతో, మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించారు. 36 ఏళ్ల విరామం తర్వాత ఈసారి మహిళా మంత్రికి అవకాశం లభించింది. ఆమె పేరు దొసాంగ్లు పుల్‌. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్‌ సతీమణి అయిన ఆమెను ఉక్కుమహిళగా పిలుస్తుంటారు.  

సిక్కిం సీఎం భార్య ఎమ్మెల్యేగా రాజీనామా 

గ్యాంగ్‌టక్‌: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ భార్య కృష్ణకుమారి రాయ్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఒక్క రోజులోనే.. గురువారం ఆ పదవికి రాజీనామా చేశారు. దానిని సభాపతి ఆమోదించారు. పార్టీ ఏకగ్రీవ నిర్ణయం మేరకే ఆమె రాజీనామా చేశారని ఫేస్‌బుక్‌ ద్వారా సీఎం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని