ఈ సారి అమెరికా రక్షణ మంత్రి..!

క్వాడ్‌ కూటమిలోని దేశాధ్యక్షుల సమావేశం ముగిసిన కొన్ని రోజుల్లోనే మరో కలక పరిణామం చోటు చేసుకొంది. అమెరికా రక్షణశాఖ మంత్రి (డిఫెన్స్‌ సెక్రటరీ) ఆస్టిన్‌ లాయిడ్‌ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

Updated : 14 Mar 2021 12:48 IST

చురుగ్గా పావులు కదుపుతున్న అమెరికా

ఇంటర్నెట్‌డెస్క్‌: క్వాడ్‌ కూటమిలోని దేశాధ్యక్షుల సమావేశం ముగిసిన కొన్ని రోజుల్లోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా రక్షణశాఖ మంత్రి (డిఫెన్స్‌ సెక్రటరీ) లాయిడ్‌ ఆస్టిన్‌ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆయన తన పర్యటనను హవాయి నుంచి ప్రారంభించారు. అమెరికా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమానార్హం.  చైనాను కట్టడి చేసేందుకు ఆసియాలోని మిత్రదేశాలకు సహకరించేలా తన పర్యటన ఉండబోతోందని ఆస్టిన్‌ వెల్లడించారు.

‘‘ఈ పర్యటన మిత్ర దేశాలు, భాగస్వాముల కోసం. మా సామార్థ్యాలు పెంచుకోవడంపై చర్చిస్తాం. మేము పోటీపడే శక్తి తగ్గింది. కానీ, భవిష్యత్తులో మా పోటీతత్వాన్ని కొనసాగిస్తాం. అంతేకాదు వృద్ధి చేసుకుంటాం కూడా. మా దగ్గర ఆ సామర్థ్యాలు, ప్రణాళికలు ఉన్నాయి. చైనాతో సహా మాకు సవాలు చేసే ఎవరికైనా తగిన సమాధానం ఇవ్వగలమని నిరూపిస్తాం’’అని లాయిడ్‌ ఆస్టిన్‌ పేర్కొన్నారు. లాయిడ్‌ తన ఆసియా పర్యటనలో భాగంగా టోక్యో, సియోల్‌తో పాటు న్యూదిల్లీలో కూడా పర్యటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని