బంగారు నాణేలు దొరుకుతున్నాయని...

నదీతీరాన మట్టిలో పురాతన బంగారు, వెండి నాణేలు దొరుకుతున్నాయనే వదంతులు రావడంతో ప్రజలు తండోపతండాలుగా వరుసలు కట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో హల్‌చల్‌ అయింది. ఈ విషయాన్ని స్థానిక కురావర్‌ పోలీస్‌ స్టేషన్‌

Published : 12 Jan 2021 09:30 IST

నదీతీరంలో తవ్వకాలు చేపడుతున్న ప్రజలు

రాజ్‌గఢ్‌‌: నదీతీరాన మట్టిలో పురాతన బంగారు, వెండి నాణేలు దొరుకుతున్నాయనే వదంతులు రావడంతో ప్రజలు తండోపతండాలుగా వరుసలు కట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో హల్‌చల్‌ అయింది. ఈ విషయాన్ని స్థానిక కురావర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జి రామ్‌నరేశ్‌ రాథోర్‌ మీడియాతో పంచుకున్నారు. జిల్లాలోని శివపుర గ్రామానికి సమీపంలోని పార్వతీ నదిలో పురాతన బంగారు, వెండి నాణేలు లభిస్తున్నాయని గత కొన్ని రోజులుగా వదంతులు వ్యాపించాయి. దీంతో నదీ తీరానికి ప్రజలు జాతరగా తరలి వచ్చి వెతుకుతున్నారు. కానీ ఎవరికీ ఒక్క నాణెం కూడా దొరకలేదు. అయినప్పటికీ స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ వదంతులను ఎవరు వ్యాప్తి చేశారో తెలియదు. కానీ గత నాలుగు రోజులుగా ప్రజలు నదీ తీరాన్ని తవ్వటానికి తరలివస్తున్నారు. నదీ ఒడ్డును తవ్వవద్దని చెప్పామని పోలీసు అధికారి తెలిపారు.  


ఇవీ చదవండి..

బర్డ్‌ఫ్లూపై అసత్యాలను ప్రచారం చేయకండి

సాగుచట్టాలను నిలిపేయండి.. లేదా స్టే ఇస్తాం
 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని