Published : 14 Oct 2021 21:12 IST

Uttar Pradesh: ఆయనను ప్రజలు త్వరలో గద్దె దించుతారు: అఖిలేశ్‌ యాదవ్‌

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు యాత్రల పేరిట జనంలోకి చొచ్చుకెళ్లి వారి ఆదరణ పొందడానికి  ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ‘సమాజ్‌ వాదీ విజయ్‌ రథ్‌ యాత్ర’ పేరిట ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా గురువారం అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గద్దె దించి సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లు గెలుస్తొందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘భాజపా పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను చూస్తుంటే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 స్థానాలు గెలుచుకుంటుంది. భాజపాను గద్దెదించడమే మా పార్టీ లక్ష్యం’’ అని అఖిలేశ్‌ తెలిపారు. సీఎం యోగి అదిత్యనాథ్‌పై అఖిలేశ్‌ నిప్పులు చెరిగారు. ‘ఫేక్‌ బాబాను ప్రజలు త్వరలో గద్దె దించుతారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో చిన్న పార్టీలతోనే కలిసి పోటీ చేస్తామని.. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోమని అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించారు. అధికారంలోని భాజపా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ‘‘భాజపా కార్యకర్తలే రైతులపైకి వాహనాలతో దూసుకెళ్లి చంపారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం’’ అని ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరిలో జరిగిన ఘటనను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘భాజపా అధికారంలోనే నిరుద్యోగం, అవినీతి, అక్రమాలు పెరిగాయి. శాంతి భద్రతలు క్షీణించాయి’’అని అఖిలేశ్‌ ఆరోపించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని