18 ఏళ్లు దాటితే మతం స్వీకరించే స్వేచ్ఛ

18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు

Published : 09 Apr 2021 23:14 IST

దిల్లీ: 18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చేతబడి, మతమార్పిడులను కట్టడి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. 18 ఏళ్లు నిండినవారు తమకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తే అడ్డుకోవడానికి ఎలాంటి కారణం లేదని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్.‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

భాజపా నేత అశ్వినీ ఉపాధ్యాయ తరఫున న్యాయవాది గోపాల శంకర నారాయణ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పిటిషన్‌ను తప్పుబట్టింది. ఆర్టికల్‌ 32 ప్రకారం ఇదే రకమైన పిటిషన్‌? అని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మత మార్పిడులు, చేతబడిని నివారించేలా న్యాయ కమిషన్‌కు దరఖాస్తు చేసుకుంటానన్న ఆయన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తిరస్కరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని