Viral Video: ‘డోగా’

కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాయామం, యోగా ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని జనాలు పాటిస్తున్నారో లేదో కానీ, ఈ వీడియోలోని ‘సీక్రెట్‌ ’ అనే కుక్క మాత్రం తూచా తప్పకుండా పాటిస్తోంది. కుక్క చేసే యోగా కాబట్టి ఇది ‘డోగా’గా వైరల్‌ అయింది. 

Updated : 21 May 2021 05:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాయామం, యోగా ఎంతగానో సాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ప్రజలు పాటిస్తున్నారో లేదో కానీ, ఈ వీడియోలోని ‘సీక్రెట్‌ ’అనే కుక్క మాత్రం తూచా తప్పకుండా పాటిస్తోంది. తన యజమానురాలు ఇచ్చిన శిక్షణతో యోగాసనాలు వేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కుక్క చేసే యోగా కావడంతో దీన్ని ‘డోగా’ అనవచ్చేమో! ఈ వీడియోలోని చివరి ఆసనం వేయడానికి ‘సీక్రెట్‌’ మొదట్లో ఇబ్బంది పడిందని,  చివరకు తనని తాను బ్యాలెన్స్‌ చేసుకోగలిగిందనీ ‘సీక్రెట్‌’  యజమానురాలు మేరీ వెల్లడించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని