Pet Dog: ఈ పెంపుడు కుక్క ఖరీదు రూ.20కోట్లు

సాధారణంగా పెంపుడు శునకాల కోసం వేలు వెచ్చిస్తుంటారు. కాస్త ధనవంతులైతే లక్షలు పెట్టి అరుదైన జాతులను కొని పెంచుకుంటారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి రూ.20కోట్లు పెట్టి అరుదైన జాతి శునకాన్ని కొనుక్కున్నారు.

Published : 07 Jan 2023 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖులు, సెలబ్రిటీలు లక్షలు పోసి విదేశాలకు చెందిన అరుదైన జాతి శునకాలకు పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ఓ జంతు ప్రేమికుడు కూడా ఓ అరుదైన జాతి కుక్కను కొన్నారు. మరి దాని ఖరీదెంతో తెలుసా..? అక్షరాలా రూ.20కోట్లు. ఆశ్చర్యపోయినా ఇది నిజం.

కర్ణాటకకు చెందిన ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్‌ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు సతీశ్‌ ఇటీవల కాకాసియన్‌ షెపెర్డ్‌ (caucasian shepherd) జాతికి చెందిన శునకాన్ని రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌మీడియా పేజీలో పోస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ విక్రయదారు నుంచి దీన్ని కొన్నట్లు తెలిపారు. ఏడాదిన్నర వయసున్న ఆ శునకానికి కాడాబామ్‌ హైడర్‌ అనే పేరు కూడా పెట్టారు. ఈ జాతి శునకాలు ఎక్కువగా అర్మేనియా, సర్కాసియా, జార్జియా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కన్పిస్తుంటాయి. 10 నుంచి 12 ఏళ్లు జీవిస్తాయి.

శునకాలను ఎంతో ఇష్టపడే సతీశ్ గతంలోనూ పలు జాతుల కుక్కలను కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఆయన దగ్గర ఇప్పటికే రూ.10కోట్ల టిబెటన్‌ మస్తిఫ్‌, రూ.8కోట్ల అలస్కన్‌ మాలామ్యూట్‌, రూ.కోటి విలువ గల కొరియన్‌ డోసా మస్తిఫ్‌ జాతి కుక్కలున్నాయి. ఇటీవల కొన్న హైడర్‌ అప్పుడే శునకాల పోటీల్లో 32 మెడల్స్‌ సాధించిందట. ఈ శునకాలను తాను మహారాజులా చూసుకుంటానని సతీశ్‌ చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని