స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధర

దేశంలో  18 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో....

Published : 04 May 2021 15:36 IST

దిల్లీ: దేశంలో  18 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 18 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలను చివరిసారి ఏప్రిల్‌ 15న సవరించారు. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై  14 పైసలు తగ్గించారు.

ఈరోజు పెరిగిన ధరతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.55కు, డీజిల్‌ ధర రూ.80.91లకు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16, డీజిల్‌ ధర రూ.88.25కు చేరగా.. విశాఖలో పెట్రోల్‌ ధర రూ.95.73, డీజిల్‌ ధర రూ.89.31గా  ఉంది. గతేదాడి మార్చిలో కేంద్రం చమురుపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినప్పటి నుంచి  ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 చొప్పున పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని