Corona Vaccine: ఫైజర్‌, మోడెర్నా టీకాలు సురక్షితమే

భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు.

Updated : 18 May 2021 12:38 IST

భారత్‌ వేరియంట్లపై సమర్థవంతమేనన్న పరిశోధకులు
అమెరికన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు. అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి పరీక్షించినట్లు పరిశోధనలో సభ్యుడైన నథానియల్‌ నెడ్‌ ల్యాండౌ తెలిపారు. ఫైజర్‌, మోడెర్నా టీకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

అనేక యాంటీబాడీలు ఈ వేరియంట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశోదకులు తెలిపారు. శరీరంలోని ఏసీఈ2 కణాలు కరోనా గ్రాహకాలుగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు. దీని కారణంగానే కరోనా వ్యాపించే తీరులో అనేక మార్పులొస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతమున్న టీకాలు ఇప్పుడున్న వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలవని తమ పరిశోధనలు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరగా ఎక్కువ మంది ప్రజలకు టీకాలను వేయడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని వారు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని