Pfizer: భారత్ కోరినా.. ముందుకురాని ఫైజర్..!
అమెరికాకు చెందిన మరో వ్యాక్సిన్ సంస్థ ఫైజర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు కోరినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
ఇంకా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోని అమెరికా సంస్థ
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ ఉత్పత్తిని దేశీయంగా చేస్తున్నప్పటికీ విదేశీ టీకాల అనుమతులను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మెడెర్నా టీకాను దిగుమతి చేసుకునేందుకు సిప్లా సంస్థకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన మరో వ్యాక్సిన్ సంస్థ ఫైజర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు కోరినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
రెండుసార్లు కోరినా..
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతంగా చేపడుతున్నప్పటికీ అవసరమైన డోసులు అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ చేయనవసరం లేకుండానే విదేశీ టీకాలకు అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ టీకా సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మోడెర్నాకు అనుమతి ఇవ్వగా.. ఫైజర్తోనూ సంప్రదింపులు చివరిదశకు వచ్చాయని ఇరు వర్గాలు వెల్లడించాయి. అత్యవసర వినియోగ అనుమతి (EUA) కోసం దరఖాస్తు చేసుకోవాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇప్పటికే రెండుసార్లు ఫైజర్‌ను కోరింది. తద్వారా అనుమతి ప్రక్రియ వేగవంతం చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహార సమస్యలు (ఇండెమ్నిటీ) ఎదురైతే బాధ్యత తీసుకోవడంపైనా కేంద్ర ప్రభుత్వం కొంతవరకు హామీ ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఫైజర్ సంస్థ ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు.
అమెరికాకు చెందిన ఫైజర్- జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను నిరోధించడంలో 95శాతానికిపైగా సమర్థత కలిగివున్నట్లు వెల్లడైంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ టీకాను అమెరికా, ఇజ్రాయెల్‌లో భారీస్థాయిలో పంపిణీ చేస్తున్నారు. దీంతో అక్కడ వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతోపాటు కొత్త వేరియంట్లపైనా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ సమయంలో భారత్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాంకేతిక, వాణిజ్య సమస్యలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!