పిల్లలకూ Covaxin:2/3దశ ట్రయల్స్‌ ఎప్పుడంటే? 

కరోనా నియంత్రణకు కొవాగ్జిన్‌ టీకాను 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు ఇచ్చేలా భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. .....

Published : 18 May 2021 21:15 IST

దిల్లీ: కరోనా నియంత్రణకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు సైతం కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేలా భారత్‌ బయోటెక్‌ సంస్థ తీవ్రంగా కృషిచేస్తున్న విషయం తెలిసిందే. క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. అయితే, మరో 10 నుంచి 12 రోజుల్లో రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమవుతాయని నీతి ఆయోగ్‌ సీనియర్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ వెల్లడించారు. 

ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందిన భారత్‌ బయోటెక్ సంస్థ.. ఈ టీకాను 525 మందిపై పరీక్షించనుంది. రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షల్లో ఆరోగ్యవంతులైన 525 మంది వాలంటీర్లు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకొనేందుకు వీలుగా క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాలని భారత్‌ బయోటెక్‌ ప్రతిపాదించగా.. అందుకు భారత ఔషధ నియంత్రణ మండలి, దానికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే. ‘కొవాగ్జిన్‌’ టీకాను ఇప్పటికే 18 ఏళ్లు పైబడినవారికి పంపిణీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని