Reopening Of Schools: దిల్లీలో తెరుచుకోనున్న పాఠశాలలు

దిల్లీలో పాఠశాలలు పునఃప్రారంభించేందుకు కేజ్రీవాల్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఆధ్వర్యంలో నిపుణుల బృందం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 27 Aug 2021 20:41 IST

దిల్లీ: కరోనా సృష్టించిన విలయం నుంచి దేశ రాజధాని దిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్‌ కేసులు 100లోపే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పాఠశాలలు పునః ప్రారంభించేందుకు కేజ్రీవాల్‌ సర్కారు నిర్ణయించింది. దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఆధ్వర్యంలో నిపుణుల బృందం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఆ నిర్ణయాన్ని ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తాజాగా ప్రకటించారు. దశల వారీగా తరగతులను ప్రారంభించనుట్లు వెల్లడించారు.

పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రుల అంగీకారం అవసరమని.. ఉపాధ్యాయులు వారిపై ఒత్తిడి తేవొద్దని సిసోడియా సూచించారు. తరగతి గది పాఠాలతో పాటు.. ఇప్పటివరకూ జరుగుతున్న  ఆన్‌లైన్‌ క్లాసులు అలాగే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. మొదటగా పైతరగతుల విద్యార్థులకు, కొద్దిరోజుల విరామం తర్వాత కింది తరగతులకు తరగతి గది పాఠాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి 9-12వ తరగతి విద్యార్థులకు, అదే నెల 8వ తేదీ నుంచి 6-8వ తరగతి విద్యార్థులకు పాఠాలు ప్రారంభించనున్నారు. మరికొద్ది రోజులకు కింది తరగతి విద్యార్థులకు పాఠాలు మొదలవనున్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని