GoDaddy: గోడాడీపై సైబర్‌ దాడి.. 12లక్షల యూజర్ల డేటా బహిర్గతం

ప్రముఖ వెబ్‌హోస్టింగ్‌ కంపెనీ, ఇంటర్నెట్‌ డొమైన్‌ రిజిస్ట్రార్‌ ‘గోడాడీ’పై సైబర్‌ దాడి జరిగింది. ఆ సంస్థ నిర్వహిస్తున్న మేనేజ్డ్‌ వర్డ్‌ప్రెస్‌ సర్వీసుపై హ్యాకర్లు దాడి చేసి

Published : 23 Nov 2021 12:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వెబ్‌హోస్టింగ్‌ కంపెనీ, ఇంటర్నెట్‌ డొమైన్‌ రిజిస్ట్రార్‌ ‘గోడాడీ’పై సైబర్‌ దాడి జరిగింది. తమ సంస్థ నిర్వహిస్తున్న మేనేజ్డ్‌ వర్డ్‌ప్రెస్‌ సర్వీసుపై హ్యాకర్లు దాడి చేసి 12లక్షల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను చోరీ చేసినట్లు గోడాడీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘నవంబరు 17న మేనేజ్డ్‌ వర్డ్‌ప్రెస్‌ హోస్టింగ్‌లో అనధికారిక థర్డ్‌ పార్టీ యాక్సెస్‌ను కంపెనీ గుర్తించింది. దీంతో వెంటనే ఐటీ ఫోరెన్సిక్‌ టీం సాయంతో దర్యాప్తు చేపట్టగా సైబర్‌ దాడి జరిగినట్లు తెలిసింది. అనధికారిక థర్డ్‌పార్టీ వ్యక్తులు పాస్‌వర్డ్‌తో మేనేజ్డ్‌ వర్డ్‌ప్రెస్‌ సిస్టమ్‌ను యాక్సెస్‌ చేశారు. దీన్ని గుర్తించిన వెంటనే మేం ఆ థర్డ్‌పార్టీని మన సిస్టమ్‌ నుంచి బ్లాక్‌ చేశాం. అయితే సెప్టెంబరు 6 నుంచే ఈ దాడి మొదలైనట్లు దర్యాప్తులో తెలిసింది. వర్డ్‌ప్రెస్‌ను ఉపయోగించే దాదాపు 12లక్షల యాక్టివ్‌, ఇన్‌యాక్టివ్‌ యూజర్ల ఈ-మెయిల్‌ అడ్రస్‌లు, కస్టమర్‌ నంబర్లు బహిర్గతమవడంతో వారి వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడింది. దీనిపై మరింత దర్యాప్తు జరుపుతున్నాం. హ్యాకింగ్‌కు గురైన బాధిత కస్టమర్లను గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. కస్టమర్ల పాస్‌వర్డ్‌లను రీసెట్‌ చేస్తున్నాం’’ అని కంపెనీ వెల్లడించింది. 

వర్డ్‌ప్రెస్‌ అనేది వెబ్‌ ఆధారిత కంటెంట్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌. సొంతంగా బ్లాగులు, వెబ్‌సైట్లు తెరుకునేందుకు వినియోగదారులు దీన్ని ఉపయోగిస్తుంటారు. గోడాడీ ఈ సర్వీసును నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని