పైలట్లు కరోనా టీకా తీసుకుంటే..

పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది కరోనా టీకా తీసుకుంటే 48 గంటల పాటు విమానంలోకి రావొద్దని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ మంగళవారం వెల్లడించింది. ‘‘టీకా తీసుకున్న తర్వాత 48 గంటల పాటు

Updated : 10 Mar 2021 04:33 IST

48 గంటలు విమానం నడపొద్దు: డీజీసీఏ

దిల్లీ: పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది కరోనా టీకా తీసుకుంటే 48 గంటల పాటు విమానంలోకి రావొద్దని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ మంగళవారం ఆదేశించింది. ‘‘టీకా తీసుకున్న తర్వాత 48 గంటల పాటు పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది విమానాలను నడిపేందుకు వైద్యపరంగా అనర్హులు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు లేకపోతేనే విధుల్లోకి రావాలి. అయితే 48 గంటల తర్వాత కూడా ఏమైనా లక్షణాలు కన్పిస్తే వారిని వైద్యుల పర్యవేక్షణకు పంపాలి’’ అని డీజీసీఏ పేర్కొంది. 

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. జనవరి 16న ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. తొలుత ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వగా.. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకాలు వేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు