Helicopter crash: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు మేడే కాల్‌..!

అరుణాచల్ ప్రదేశ్‌ హెలికాప్టర్‌ ప్రమాద ఘటనలో శనివారం చివరి మృతదేహాన్ని కూడా గుర్తించినట్లు ఆర్మీ తెలిపింది. 

Published : 22 Oct 2022 14:13 IST

ఇటానగర్‌: అరుణాచల్ ప్రదేశ్‌ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఘటనకు ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఒక మేడే కాల్ వచ్చిందని శనివారం భారత సైన్యం వెల్లడించింది. అలాగే ఆ హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మృతి చెందారని తెలిపింది. చివరి మృతదేహాన్ని కూడా గుర్తించినట్లు చెప్పింది.

‘ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(ATC)కి మేడే కాల్‌ వచ్చింది. సాంకేతిక లోపాన్ని సూచించింది. అది అత్యవసర ప్రమాదకర పరిస్థితికి నిదర్శనం. కానీ ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. పైలట్ల అందరూ అనుభవం కలవారు. అయితే కొండలు, దట్టమైన అడవులు కలిగిన ఆ ప్రాంతం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఇక ఆ హెలికాప్టర్‌ 2015 నుంచి విధుల్లో ఉంది. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు విచారణ ఆదేశించాం’ అని ఆర్మీ ప్రకటనలో వెల్లడించింది. 

శుక్రవారం కూలిన ఆర్మీ హెలికాప్టర్‌లో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఐదో మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ ప్రమాదంలో కూలిపోయినది స్వదేశీ తయారీ  సాయుధ హెలికాప్టర్‌ (హెచ్‌ఏఎల్‌ - రుద్ర).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని