Published : 16/01/2022 03:36 IST

Pinarayi Vijayan: అమెరికా నుంచే కేరళలో పాలన.. సీఎం వెల్లడి

తిరువనంతపురం: చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కొంతకాలం అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని వెల్లడించారు. మరెవరికీ పాలనాబాధ్యతలను అప్పగించబోనని స్పష్టం చేశారు. అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటానని తెలిపారు. చికిత్స కోసం తన భార్య, వ్యక్తిగత సిబ్బందితో కలిసి విజయన్ అమెరికా వెళ్లారు. జనవరి 29న తిరిగి రానున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా సీఎం వర్చువల్ పద్ధతిలోనే హాజరయ్యారు. కాగా జనవరి 19న మరో కేబినెట్ భేటీ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆస్పత్రి బెడ్​పై నుంచీ పని చేస్తానని ఈ మేరకు సూచనాప్రాయంగా వెల్లడించారు.

పినరయి విజయన్‌ 2018లో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్​కు బాధ్యతలు అప్పగించారు. ఈసారి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులైన ఎంవీ గోవిందన్, కె.రాధాకృష్ణన్​కు బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. అయితే, కేబినెట్ భేటీ ప్రకటనతో ఈ ఊహాగానాలకు సీఎం తెరదింపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని