- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
IRCTC: రైల్వే టికెట్ బుకింగ్‌కు పాన్, ఆధార్!
దిల్లీ: రైల్వే టికెట్ బుకింగ్‌లో రాబోయే రోజుల్లో కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న దళారీ వ్యవస్థను రూపుమాపడానికి రైల్వే శాఖ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్ బుకింగ్‌కు పాన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. గతంలో చేపట్టిన చర్యలు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
టికెట్ బుకింగ్‌కు పాన్, ఆధార్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయడం ద్వారా ప్రయాణికులే టికెట్ తీసుకుంటారని, తద్వారా దళారీ వ్యవస్థ అంతమవుతుందని అరుణ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ఓ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్ అధికారులతో సంప్రదింపులు జరిపామని, త్వరలో మిగిలిన గుర్తింపు కార్డుల జారీ యంత్రాంగాలతోనూ చర్చిస్తామని చెప్పారు. 2019 అక్టోంబర్ -నవంబర్ నుంచి దళారులను పట్టుకోవడం ప్రారంభించామన్నారు. ఈ ఏడాది మే వరకు 14,257 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. సుమారు ₹28.34 కోట్ల విలువైన టికెట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులకు ఆర్పీఎఫ్ పెద్దపీట వేస్తోందని, కొవిడ్ సమయంలోనూ ప్రయాణికుల రక్షణలో ముందు వరుసలో నిలిచిందన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
US Visa: అమెరికా వీసా కష్టాలు.. అపాయింట్మెంట్కు 510 రోజులు నిరీక్షించాల్సిందే!
-
India News
Rajnath Singh: తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయా.. రాజ్‌నాథ్ సింగ్ భావోద్వేగం
-
Crime News
Kakinada: షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు: ఇద్దరి మృతి.. 9 మందికి గాయాలు
-
World News
N Korea: దక్షిణ కొరియాదో చెత్త ఆఫర్: కిమ్ సోదరి
-
General News
APSRTC: విలీనంతో ఆశించిన ప్రయోజనాలేవీ?: ఆర్టీసీ సంఘాల ఆక్షేపణ
-
Crime News
Hyderabad News: ప్రిన్సిపల్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం