మాస్క్‌ ధరించలేదని అత్యవసర ల్యాండింగ్‌!

ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ప్రజలంతా మాస్కులు ధరించడం తప్పనిసరైంది. ఎక్కడికి వెళ్లినా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. ఎంతలా అంటే.. ఓ ప్రయాణికుడు మాస్కు పెట్టుకోలేదని......

Published : 09 Sep 2020 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ప్రజలంతా మాస్కులు ధరించడం తప్పనిసరైంది. ఎక్కడికి వెళ్లినా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని కఠిన నియమాలు అమలు చేస్తున్నారు. ఎంతలా అంటే.. ఓ ప్రయాణికుడు మాస్కు పెట్టుకోలేదని ఏకంగా గాల్లో ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసి అతడిని అరెస్టు చేసేంతలా..!

సాధారణంగానే విమాన ప్రయాణ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తుంటారు. వాటిని అతిక్రమించినా, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టి విమాన ప్రయాణాలు చేయకుండా అనర్హత వేటు వేస్తుంటుంటారు. అయితే ఇటీవల బ్రిటన్‌కి చెందిన 32 ఏళ్ల ఓ ప్రయాణికుడు టర్కీలోని అంతల్య ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కాడు. విమానం గాల్లోకి లేచిన తర్వాత మాస్కు ధరించాలని విమానంలోని సిబ్బంది అతడికి చెప్పినా అందుకు నిరాకరించాడు. దీంతో ఇతర ప్రయాణికులు అతడి సమీపంలో కూర్చొడానికి ఇష్టపడలేదు. ఎవరు ఎంత చెప్పినా అతడు మాస్కు ధరించకపోగా.. ప్రయాణికులు, విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయం పైలట్స్‌కి తెలియడంతో మార్గమధ్యంలోని కొస్‌ ఐలాండ్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మాస్కు ధరించని వ్యక్తిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంతరం విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని