Taj Mahal : తాజ్ మహల్ వద్ద విమానం కలకలం..!

ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్  వద్ద.. ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.

Published : 02 Mar 2022 01:28 IST

ఆగ్రా: ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్  వద్ద.. ఓ విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్లపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. విమానం తాజ్ మహల్‌కు అతి సమీపంగా రావడం ఆందోళన కలిగించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఉరుసు ఉత్సవాలు జరుగుతున్న సమయంలో.. విమానం తాజ్ మహల్‌కు సమీపంగా రావడం చూసి పర్యటకులు భయాందోళనకు గురయ్యారు. తాజ్ మహల్ సమీపంలో విమానం ఎగురుతున్న వీడియోను తాను చూసినట్లు ఆగ్రా సర్కిల్ ఏఎస్‌ఐ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నివేదిక ఇవ్వాలని సెంట్రల్  ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్‌ఎఫ్‌ను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోరింది. తాజ్ మహల్ వద్ద భద్రతను సీఐఎస్‌ఎఫ్‌ పర్యవేక్షిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని