28 మందితో వెళ్తున్న ఆ విమానం కూలిపోయింది!

రష్యాలో 28 మందితో వెళ్తూ గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్టు రష్యన్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ గుర్తించినట్టు ఆర్‌ఐఏ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.......

Updated : 06 Jul 2021 18:01 IST

మాస్కో: రష్యాలో 28 మందితో వెళ్తూ గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్టు రష్యన్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ గుర్తించినట్టు ఆర్‌ఐఏ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది.  An-26 విమానం కూలిపోయిన ఘటనా స్థలానికి కొన్ని నౌకలు వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పం వద్ద ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.  ఫార్‌ ఈస్ట్‌ ప్రాంతంలో పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి ఉత్తర కమ్చట్కాలోని పలనా గ్రామం వెళ్తుండగా ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)తో విమానం సంబంధాలు తెగిపోయినట్టు రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ తెలిపింది. ఘటనాస్థలానికి కొన్ని నౌకలు చేరుకుంటున్నట్టు పేర్కొంది. ఈ విమానంలో 22 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు వెల్లడించింది. ఈ ప్రయాణికుల్లో పలనా గ్రామ మేయర్‌ ఓల్గా మొఖిరేవా కూడా ఉన్నట్టు స్థానిక అధికారులు చెప్పినట్టు మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణం మేఘావృతమై ఉన్నట్టు స్థానిక వాతావరణ శాఖ పేర్కొన్నట్టు మీడియా పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని