1975 ఎమర్జెన్సీ: కేంద్రానికి సుప్రీం నోటీసులు!

భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన నాలుగున్నర దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టులో అభ్యర్ధన దాఖలైంది. 1975 నాటి ఎమర్జెన్సీని ‘పూర్తి రాజ్యాంగవిరుద్ధం’గా ప్రకటించాలంటూ ఓ వృద్ధురాలు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Updated : 15 Oct 2022 16:56 IST

దిల్లీ: భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీంకోర్టులో ఓ అభ్యర్ధన దాఖలైంది. 1975 నాటి ఎమర్జెన్సీని ‘పూర్తి రాజ్యాంగవిరుద్ధం’గా ప్రకటించాలంటూ ఓ వృద్ధురాలు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేంద్రప్రభుత్వ స్పందనను కోరింది.

1975నాటి ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని వీరా సారిన్‌ అనే 94ఏళ్ల వృద్ధురాలు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె అభ్యర్ధనను విచారించేందుకు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ ధర్మాసనం అంగీకరించింది. అయితే, 45ఏళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ అభ్యర్ధన అసలు విచారణకు సాధ్యమైనదా? అవసరమైనదా? అనే అంశాలను కూడా పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ‘మనకు కొన్ని ఇబ్బందులున్నాయ్‌. అత్యయికస్థితి విధించి ఉండాల్సింది కాదు’ అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలాఉంటే, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1975 జూన్‌ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 21 నెలలపాటు కొనసాగిన ఆ అత్యయికస్థితిని 1977 మార్చి నెలలో ఎత్తివేశారు.

ఇవీ చదవండి..
విదేశీ కంపెనీల్లో డ్రాగన్‌ ఊడలు..!
ఏనుగుల మరణాలు అక్కడే ఎక్కువ!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని