PMGKAY: గుడ్‌న్యూస్‌.. ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో....

Published : 27 Mar 2022 01:43 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం గడువును మరో ఆర్నెళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు.  ‘‘భారతదేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు అంటే సెప్టెంబర్‌ 2022  పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందులాగే 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు’’ అని పేర్కొన్నారు.

ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 2020 ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వచ్చింది. మార్చి నెలాఖరుతో దీనికి గడువు ముగియనున్న వేళ ఈరోజు కేంద్ర కేబినెట్‌ భేటీ అనంతరం పీఎంజీకేఏవై పథకాన్ని మరోసారి పొడిగించాలని నిర్ణయించినట్టు మోదీ ప్రకటించడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని